తిరుపతి జిల్లాలో ఘోరం జరిగింది. భార్యను అనుమానంతో భర్త పొట్టనబెట్టుకున్నాడు. భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. వీరిద్దరికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే ఉషపై అనుమానంతో లోకేశ్వర్ కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. గత నెల 30న భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది. దీంతో పిల్లల్ని తీసుకుని ఆమె పుట్టింటికి వెళ్లింది.