ఈ నెల 5వ తేదీలోపు విధుల్లో చేరాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు డెడ్‌లైన్ విధించింది. దీంతో ఆదివారం ఉదయం జేఏసీ నేతలు... రాష్ట్ర బీజేపీ నేతలతో పాటు టీజేఎస్, సీపీఐ, టీడీపీ నేతలను కలిశారు.
తాము చేస్తోన్న సమ్మెను జాతీయ స్థాయిలో తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్టీసీ పరిస్థితిని అమిత్ షాకు వివరిస్తామని, ఇందులో జోక్యం చేసుకోవాల్సిందిగా కోరతామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి చెప్పారు.
మరోవైపు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టీఎస్ ఆర్టీసీ కార్మికులకు విధుల్లో చేరేందుకు విధించిన డెడ్‌లైన్‌కు ఓ ఉద్యోగి స్పందించాడు. ఉప్పల్ డిపోలో అసిస్టెంట్ డిపో మేనేజర్‌గా పనిచేస్తున్న కేశవ కృష్ణ (ఈ.నం. 201805) తాను తిరిగి విధుల్లో చేరుతున్నట్లు ప్రకటించారు.