డేటా చోరీ జరిగిందా? లేదా? ఆధార్ కీలక ప్రకటన

గురువారం, 18 ఏప్రియల్ 2019 (14:24 IST)
తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారం రేపిన డేటా చోరీ కేసులో ఆధార్ సంస్థ ముఖ్యమైన ప్రకటన చేసింది. ఆధార్ సర్వర్‌ల నుండి ఐటీ గ్రిడ్ సంస్థ ఎటువంటి డేటాను అక్రమంగా, చట్ట విరుద్ధంగా చోరీ చేయలేదని స్పష్టం చేసింది. బుధవారం దీనిపై యూఐడీఏఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆధార్ సంస్థకు సంబంధించిన కేంద్రీకృత సమాచార నిల్వ కేంద్రంతో పాటు సర్వర్‌లు అత్యంత భద్రతతో ఉన్నాయని తెలిపింది.
 
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ చేసిన విచారణలో ఆధార్ చట్టానికి విరుద్ధంగా హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్ సంస్థ పెద్ద సంఖ్యలో పౌరుల వివరాలను సేకరించినట్లు నివేదిక ఇచ్చింది. సాధారణంగా చాలా సర్వీస్ ప్రొవైడర్లు నేరుగా వ్యక్తుల నుంచే వారి ఆధార్ డేటాను, ఇతర వివరాలు సేకరించడం జరుగుతోంది. 
 
అయితే సేకరించిన ఆ సమాచారాన్ని నిర్థిష్టంగా దేని కోసం సేకరించారో దాని కోసమే వినియోగించాలి. సదరు వ్యక్తుల సమ్మతం లేకుండా సేకరించిన సమాచారాన్ని ఇతరులకు అందించకూడదు. ఆధార్ చట్టానికి వ్యతిరేకంగా ఆ సమాచారాన్ని సేకరించినా, నిల్వ చేసినా, ఉపయోగించినా అందుకు బాధ్యులైన వారిని ప్రాసిక్యూట్ చేయవచ్చునని యూఐడీఏఐ ప్రకటించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు