Vallabhaneni Vamsi: తాడేపల్లిలో జగన్‌ను కలిసిన వల్లభనేని వంశీ దంపతులు (video)

సెల్వి

గురువారం, 3 జులై 2025 (14:25 IST)
Vallabhaneni Vamsi
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను తాడేపల్లి నివాసంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దంపతులు కలిశారు. బుధవారం జైలు నుంచి బెయిల్‌పై వంశీ విడుదలయ్యారు. ఆయనపై కిడ్నాప్‌, బెదిరింపులు, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, నకిలీ ఇళ్ల పట్టాలు, అక్రమ గనుల తవ్వకాలు వంటి ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. 
 
ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో బెయిల్‌ మంజూరు కావడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఆపై నేరుగా కుటుంబ సభ్యులతో కలిసి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. తనకు కష్టకాలంలో అండగా నిలిచినందుకు వైయస్‌ జగన్‌కు వల్లభనేని వంశీ దంపతులు ధన్యవాదాలు తెలిపారు.
 
ఇక అంతకుముందు వంశీ నివాసానికి వైసీపీ పార్టీ నేత‌లు వెళ్లారు. ఉంగుటూరు మండలం తేలప్రోలులో వల్లభనేని వంశీని పరామర్శించారు కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్. కాగా 137 రోజులు జైల్‌లో ఉన్న వంశీ బుధవారం జైలు నుండి విడుదలయ్యారు.

తాడేపల్లిలో వైయస్‌‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్ గారిని కలిసిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారి దంపతులు

కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులతో 140 రోజులు అక్రమ నిర్భందంలో ఉండి.. బెయిల్‌పై నిన్న విడుదలైన వంశీ గారు pic.twitter.com/LIHscPE8G2

— YSR Congress Party (@YSRCParty) July 3, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు