రాష్ట్రప్రభుత్వం మొదటిసారి ఆర్థిక పరిస్థితి బాగోలేదని సిఎం జగన్ కేంద్రాన్ని అడిగారన్నారు బిజెపి రాష్ట్ర కార్యదర్సి, ఎమ్మెల్సీ మాధవ్. పింఛను, జీతాలు ఇవ్వలేని స్థితిలో వైసిపి ప్రభుత్వం దేహి అనే దౌర్యాగ్య స్థితికి వచ్చిందన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడే విధంగా గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులను నమ్మించి వైసిపి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు బిజెపి అండగా నిలుస్తుందన్నారు.
నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజల్ ధరలను విపరీతంగా ప్రభుత్వం పెంచేసిందన్నారు. పండుగలు వస్తే విపరీతంగా యాభై శాతం వరకు ఆర్టీసీ ఛార్జీలు పెంచి పేదలపై అధిక భారం మోపుతోందన్నారు. ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలన్నారు.