ఈ నెల 15 వ తేదీ నుంచి జూన్ 14 వ తేదీ వరకు మొత్తం 61 రోజులపాటు దేశవ్యాప్తంగా సముద్ర జలాల్లో సముద్ర ఉత్పత్తుల వేటను పూర్తిగా నిషేధించనున్నారు. చేపలు, రొయ్యలు, ఇతర సముద్ర ఉత్పత్తుల వేటను నిషేధిస్తున్నట్లు ఏపీ మత్స్యశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత 2020-21 సీజన్ ఈనెల 15 వ తేదీతో ముగియనుంది.
నిషేధ సమయంలో ఎవరైనా సముద్రంలో వేట సాగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, బోట్లు, మత్స్య ఉత్పత్తులను సైతం సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ నిషేధ ఆంక్షలను రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు పర్యవేక్షించనున్నారు.