Sharmila on YS Jagan: జగన్‌కు రూ.1750 కోట్ల లంచం ఇచ్చారు... షర్మిల కేసు

సెల్వి

గురువారం, 5 డిశెంబరు 2024 (14:39 IST)
Sharmila
Sharmila on YS Jagan:  ఏపీలో సీఎంగా ఉన్న సమయంలో జగన్‌కు రూ.1750 కోట్ల లంచం ఇచ్చారని అమెరికాలో దర్యాప్తు సంస్థలు బయటపెట్టాయని, దీంతో అక్కడి సెక్యూరిటీ ఎక్స్ఛైంజ్ కమిషన్ కేసులు కూడా పెట్టారని పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల తెలిపారు. అదానీ సంస్థల ద్వారా అమెరికాలో కూడా పెట్టుబడులు పెట్టాలనుకున్నారని ఆరోపించారు. 
 
ఏపీలో కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ)తో గత వైసీపీ సర్కార్ కుదుర్చుకున్న 7 వేల కోట్ల సౌర విద్యుత్ సరఫరా ఒప్పందం విషయంలో అప్పటి సీఎం జగన్‌కు రూ.1750 కోట్లు ముడుపులు అందాయన్న ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆమె విజయవాడ బస్టాండ్‌లో ఉన్న ఏసీబీ కార్యాలయానికి వెళ్లి అధికారులకు దీనిపై ఆధారాలు సమర్పించారు.
 
ప్రస్తుతం ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ గతంలోనే ఈ అవినీతి వల్ల రాష్ట్రంపై భారం పడబోతోందని హైకోర్టులో పిటిషన్ కూడా వేశారని షర్మిల గుర్తుచేశారు. చంద్రబాబుకు, టీడీపీకి 2021లోనే ఇంత అవినీతి జరిగిందని తెలిసినా ఇప్పటికీ చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అమెరికా దర్యాప్తు సంస్థలే జగన్ స్కామ్ గురించి బయటపెడితే.. ఇంకెందుకు ఆలస్యమని అడిగారు. 
 
అలాగే ఏసీబీ చేత సుమోటోగా స్వీకరించి విచారణ కొనసాగించాల్సిన భాద్యతను ప్రభుత్వం గుర్తించాలని ఆమె కోరారు. ఏసీబీ చేత విచారణ చేయించడంలో ప్రభుత్వం వెనుకడుగు వేస్తే, ఆదానీకి జగన్ కు మద్దతు పలికినట్లేనని సీరియస్ కామెంట్స్ చేశారు.

వైఎస్ జగన్‌పై ఫిర్యాదు చేసిన షర్మిల

అదానీ కంపెనీ నుంచి రూ.1750 కోట్ల లంచం తీసుకున్న జగన్‌పై విచారణ చేయాలని వినతిపత్రం

అమెరికా దర్యాప్తు సంస్థలే జగన్ స్కామ్ గురించి బయటపెడితే.. చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించిన షర్మిల

టీడీపీ బోను నుంచి ఏసీబీని విడుదల చేయాలని… pic.twitter.com/2vbbTuO5Jl

— BIG TV Breaking News (@bigtvtelugu) December 5, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు