తెలుగు సినీ రంగంపై మీడియా అమితాసక్తి

సోమవారం, 24 డిశెంబరు 2007 (11:24 IST)
FileFILE
ఈ ఏడాది సినీ రంగంపై మీడియా అమితాసక్తి కనపరిచింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై జాతీయ స్థాయిలో మీడియా తన దృష్టిని కేంద్రీకరించింది. దీనికి ఆజ్యం వేసవిలో జరిగిన తెలుగు చలన చిత్ర వజ్రోత్సవ వేడుకలు మీడియాకు పద్ద ఆకర్షణగా నిలిచాయి. ఉత్సవాలు నిర్వహించిన కేఎస్.రామారావును ఉద్దేశించి మోహన్‌బాబు చేసిన ఉద్ధేశపూర్వక ప్రసంగం మెగాస్టార్ ఇచ్చిన ఆవేశపూరిత సమాధాననాలపై జాతీయ స్థాయిలో పెద్ద చర్చే జరిగింది. దాంతో సినిమా రంగంలో రెండు గ్రూపులు ఉన్నాయనే విషయం సగటు ప్రేక్షకుడికి తేటతెల్లమైంది.

మరోవైపు పవన్ కళ్యాణ్ వివాహం మళ్లీ చర్చనీయాంశమైంది. ఆయన మొదటి భార్య వైజాగ్‌కు చెందిన నందిని.. తనకు విడాకులు ఇవ్వకుండా రెండో వివాహం చేసుకున్నాడనీ, తనకు మనోవర్తి లభించడం లేదని కోర్టుకెక్కింది. అయితే... డేటింగ్ తరహాలో విదేశీ పద్దతిని మాత్రమే అవలంభించాననీ, తనకు రేణూ దేశాయ్‌కు వివాహం జరగలేదని ఉత్తిగానే కలసి ఉంటున్నామంటూ.. కాకమ్మ కథలతో మీడియాకు పబ్లిక్‌కు మంచి మేత వేశాడు. దీంతో ఏనోటా విన్నా వీరివివాహం గురించే.

ఇదిలావుంటే.. చిరంజీవి తన చిన్న కుమార్తె శ్రీజ-శిరీష్ భరద్వాజ్‌ల ప్రేమ వివాహం కూడా మీడియాను ఆకర్షించింది. సస్పెన్స్ సినిమాల్లాగా ఆమె వివాహం హైదరాబాద్‌లో మొదలై ఢిల్లీలో ముగిసింది. మధ్యలో ఎన్నో ట్విస్ట్‌లు, ఛేజ్‌లు మీడియాకు మళ్లీ మంచి మేత దొరికినట్టియింది. తనకు తన బాబాయ్ నుంచి ప్రాణరక్షణ కల్పించాలంటూ.. శ్రీజ పేర్కొనడంతో సినిమాటిక్‌గా పవన్ కళ్యాణ్ తన లైసెన్స్ రివాల్వర్‌ను పోలీసు స్టేషన్‌లో హ్యాండ్ ఓవర్ చేయడం మరో విశేషం.

FileFILE
అదేసమయంలో కామన్‌మెన్ ప్రొటక్షన్ ఫోర్సు పేరిట కొత్త సంస్థను నెలకొల్పి కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు. అంతేకాకుండా.. సమాజ సేవచేస్తానని ముందుకువచ్చాడు. ఇదిలావుండగా.. వీటిని తలదన్నే చందంగా చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం వార్తలు సంచలనం సృష్టించాయి. రాత్రికిరాత్రే కొన్ని పత్రికలు వార్తలు గుప్పించాయి. వీటిని కొన్ని రోజుల పాటు చిరంజీవి వేడుక చూస్తూ కాలంగడిపారు. ఇంటి సమస్యలన్నీ మరుగునపడి పోయి ఆయన రాజకీయాల్లోకి వస్తే మంచిదా? కాదా? అంటూ మీడియా రకరకాలుగా సర్వేలు నిర్వహించింది.

రాష్ట్రంలో వేడివేడిగా చర్చ జరుగుతుండగా.. ఒక్కసారిగా నీళ్లు చల్లుతూ అభిమానులు తొందరపడొద్దని, నేను చెప్పేవరకు ఆగాలని హితబోధ చేశారు. చిరువస్తే కాపుకులం ప్రాధాన్యత వస్తుందని భావిస్తున్న వారికి 'ఒక్కమగాడు' ఆడియో ఫంక్షన్‌లో కాపు పెద్దగా దాసరి నారాయణ రావు కుల ప్రాతిపదికగా చిత్రరంగం, రాజకీయ రంగం భ్రస్టుపట్టిపోతున్నాయని బాణాలు సంధించారు. బాలకృష్ణ రాజకీయాల్లోకి వస్తే.. కాబోయే సీఎం బాలయ్యా అంటూ.. దాసరి తన శిష్యుడు ఆర్.నారాయణ మూర్తి చేత చెప్పించాడు.

దాసరి శిష్యుడి మాటలను ఆలకిస్తూ.. బాలయ్య మిన్నకుండి పోయారు. ఒకవేళ చిరు రాజకీయ రంగం ప్రవేశం చేస్తే దాన్ని అడ్డుకునేందుకు దాసరి ద్వారా కాంగ్రెస్ నాయకులు కార్యాన్ని నిర్వర్తించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది సినీ వివాహాలు కూడా మీడియాను ప్రధానంగా ఆకర్షించాయి. పవన్ కళ్యాణ్ భార్య వివాహం ఒకఎత్తైతే, శ్రీజ, ఆర్తీ ఆగర్వాల్, టీవీ ఆర్టిస్టు సెల్వరాజ్, కెమరామెన్ రసూల్ వివాహాలు ఆర్య సమాజ్‌కు వేదికయ్యాయి.