ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది మొదలు ప్రజాశాంతి పార్టీ చీఫ్ కె.ఎ పాల్ ప్రత్యేకించి వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిపైన టార్గెట్ పెట్టారా అనే అనుమానం కలుగుతోందంటున్నారు కొందరు. ఎందుకంటే... ఆయన చేస్తున్న విమర్శలు ఎక్కువగా జగన్ మోహన్ రెడ్డి పైనే గురి చేస్తున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే, కె.ఎ పాల్ మరోసారి జగన్ మోహన్ రెడ్డి పైన సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు అర్హతలు లేవనీ, ఆయనను సీఎం చేస్తే రాష్ట్రంలో అరాచక పరిస్థితులు నెలకొంటాయన్నారు. జగన్ అవినీతిపరుడనీ, అలాంటివారు జైల్లో వుంటేనే ప్రజలకు మంచిదంటూ చెప్పుకొచ్చారు. రాష్ట్రం మీద ఎంతమాత్రం గౌరవం వున్నా దయచేసి జగన్ మోహన్ రెడ్డికి ఓట్లు వేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నానంటూ వెల్లడించారు.