ఎన్నికల కోడ్‌ని ఉల్లంఘించిన కేసులో సినీ నటుడు, బెంగుళూరు సెంట్రల్ లోక్‌సభ స్వతంత్ర అభ్యర్థి ప్రకాష్ రాజ్ చిక్కుకున్నారు. ఇలా ప్రకాష్ రాజ్‌పై కేసు నమోదు కావడం రెండోసారి. ఈయన తాజాగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారు. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు ఎన్నికల కోడ్ అతనిపై ఉల్లంఘన కేసు నమోదైంది.
గతంలో కూడా ఇతనిపై ఉల్లంఘన కేసు నమోదైంది. ప్రకాష్ రాజ్ నామినేషన్ వేసే సమయంలో ఆటోలో ర్యాలీగా వచ్చారు. ఆ ఆటోకు అనుమతి తీసుకోలేదు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగళూరులోని అశోక్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ దాఖలైంది. మార్చి 22న జరిగిన ఈ ఘటనపై రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ఇక మార్చి 12న కూడా బెంగుళూరు మహాత్మాగాంధీ సర్కిల్‌లో అనుమతి లేకుండా ర్యాలీలో మైక్ వినియోగించి ఓటు అభ్యర్థించాడని ఎన్నికల అధికారులకు కొందరు స్థానికులు వీడియో తీసి పంపించారు. అది రాజకీయపరమైన ర్యాలీ కానప్పటికీ మీడియా, రచయితలు, ఉద్యమకారులు, కళాకారులతో కలిసి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అంటూ పబ్లిక్ ర్యాలీలో ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు. ఎన్నికల అధికారులు వెళ్లి చూసి కోడ్‌ని ఉల్లంఘించారని అతనిపై కేసు నమోదు చేశారు. ఇప్పుడు రెండో కేసులో ఇరుక్కుని చిక్కుల్లో పడ్డారు.