అభ్యర్థుల ఎంపికలో పార్టీ అధినేతదే ఫైనల్ : జనసేన నేత నాగబాబు

వరుణ్

బుధవారం, 27 మార్చి 2024 (12:43 IST)
అభ్యర్థుల ఎంపికలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌దే తుది నిర్ణయమని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పష్టం చేశారు. టిక్కెట్లు రానివారు పార్టీ అధినేతతో పాటు పార్టీపై విమర్శలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ముఖ్యంగా, సీట్ల సర్దుబాటు విషయంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య కొన్ని స్థానాల్లో విభేదాలు నెలకొనివున్నాయి. దీంతో కొన్ని స్థానాల్లో గందరగోళం నెలకొంది. ఈ ప్రాంతాల్లో సీట్లు దక్కని వారు మీడియా ముందుకు వచ్చిన పార్టీతో పాటు పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
వీటిపై పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ ప్రధాన కార్యవర్గంతో చర్చించిన అనంతరం పవన్ ఒక నిర్ణయానికి వస్తారనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని కోరారు. అధ్యక్షులు ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అందుకు విరుద్ధంగా బహిరంగ వేదికలు, మీడియా, సామాజిక మాధ్యమాలలో మాట్లాడితే అది పార్టీ వ్యతిరేక చర్యగా పరిగణించబడుతుందని చెప్పారు. ఇటువంటి అంశాలపై పార్టీ కాన్ ఫ్లిక్ట్ మేజేజ్ మెంట్ విభాగం బాధ్యులతో చర్చిస్తుందని... సంబంధిత వ్యక్తులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు