తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధినికి బాపట్ల ఎంపీ టిక్కెట్ ఇచ్చిన చంద్రబాబు!!

ఠాగూర్

శుక్రవారం, 22 మార్చి 2024 (13:58 IST)
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న మాజీ డీజీపీ కృష్ణప్రసాద్‌కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్‌సభ టిక్కెట్‌ను కేటాయించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆయన తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ టిక్కెట్‌ను ఆశించారు. అయితే, అక్కడ నిరాశ ఎదురైంది. అలాగే, గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం టిక్కెట్‌ కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం చంద్రబాబు నాయుడు ఏపీలోని లోక్‌సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. మొత్తం 13 మంది ఎంపీ అభ్యర్థులతో పాటు 11 మంది శాసనసభ అభ్యర్థులను ఆయన ప్రకటించారు. ఇందులో బాపట్ల లోక్‌సభ స్థానం నుంచి కృష్ణప్రసాద్‌కు సీటు కేటాయించడం గమనార్హం. 
 
తెలుగుదేశం పార్టీ మూడో అభ్యర్థుల జాబితా ఇదే... 
 
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థు మూడు జాబితాను శుక్రవారం ప్రకటించారు. మొత్తం 11 అసెంబ్లీ స్థానాలతో పాటు 13 లోక్‌సభ స్థానాలకు ఆయన అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మధ్య కుదిరిన పొత్తులో భాగంగా, టీడీపీ 144 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, ఇదివరకే 128 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను చంద్రబాబు ప్రకటించారు. తాజాగా మరో 11 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. అయితే, మరో ఐదు శాసనసభ, నాలుగు ఎంపీ స్థానాలకు మాత్రం అభ్యర్థుల ఖరారుపై సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. 
 
11 మంది అసెంబ్లీ అభ్య‌ర్థులు వీరే...
1. ప‌లాస - గౌతు శిరీష‌
2. పాత‌ప‌ట్నం - మామిడి గోవింద్ రావు
3. శ్రీకాకుళం - గొండు శంక‌ర్‌
4. శృంగ‌వ‌ర‌పు కోట - కోళ్ల ల‌లితా కుమారి
5. కాకినాడ సిటీ - వ‌న‌మాడి వెంక‌టేశ్వ‌ర రావు
6. అమ‌లాపురం - అయితాబ‌త్తుల ఆనంద రావు
7. పెన‌మ‌లూరు (ఎస్సీ) - బోడె ప్ర‌సాద్‌
8. మైల‌వ‌రం - వ‌సంత వెంక‌ట కృష్ణ ప్ర‌సాద్‌
9. న‌ర‌స‌రావుపేట - డాక్ట‌ర్ చ‌ద‌ల‌వాడ అర‌వింద్‌ బాబు
10. చీరాల - మ‌ద్దులూరి మాల‌కొండ‌య్య యాద‌వ్‌
11. స‌ర్వేప‌ల్లి - సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి 
 
13 మంది పార్ల‌మెంట్ అభ్య‌ర్థుల జాబితా... 
1. శ్రీకాకుళం - కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు
2. విశాఖ‌ప‌ట్నం - మాత్కుమిల్లి భ‌ర‌త్‌
3. అమ‌లాపురం - గంటి హ‌రీష్ మాధుర్‌
4. ఏలూరు - పుట్ట మ‌హేష్ యాద‌వ్‌
5. విజ‌య‌వాడ‌- కేశినేని శివ‌నాధ్ (చిన్ని)
6. గుంటూరు - పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌
7. న‌ర‌స‌రావుపేట - లావు శ్రీకృష్ణ దేవ‌రాయ‌లు
8. బాప‌ట్ల - టీ. కృష్ణ ప్ర‌సాద్‌
9. నెల్లూరు - వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి
10. చిత్తూరు - ద‌గ్గుమ‌ళ్ల ప్ర‌సాద్ రావు
11. క‌ర్నూలు - బ‌స్తిపాటి నాగ‌రాజు (పంచ‌లింగాల నాగ‌రాజు)
12. నంద్యాల - బైరెడ్డి శ‌బ‌రి
13. హిందూపూర్ - బీకే పార్థ‌సార‌థి 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు