సీఎం జగన్‌కు సలాం కొట్టేవాళ్లు నాకు వెన్నుపోటు పొడుస్తున్నారు: మంత్రి రోజా

ఐవీఆర్

సోమవారం, 13 మే 2024 (19:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. గత రెండు నెలలుగా హోరాహోరీ ప్రచారాల మధ్య ఈరోజు జరుగుతున్న ఎన్నికల్లో పలుచోట్లు ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
 
ఇక అసలు విషయానికి వస్తే... ఏపీ పర్యాటక శాఖామంత్రి రోజా నగరిలో ఓటింగ్ సరళిపై మాట్లాడారు. తనకు తెలుగుదేశం వారితో పెద్దగా ఇబ్బంది లేదనీ, సొంత పార్టీ వాళ్లతోనే సమస్యలు ఎదురవుతున్నాయని వాపోయారు.
 
వైసిపిలో నామినేటెడ్ పోస్టులు తీసుకుని అనుభవించినవారే, సీఎం జగన్ మోహన్ రెడ్డి దగ్గరకు వెళ్లి నమస్కారాలు పెట్టేవాళ్లే పోలింగ్ బూత్ లకు వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఇది చాలా దురదృష్టకర విషయమని చెప్పారు. చూడండి ఆమె మాటల్లోనే...
 

నగరి లో, వైసీపీ లో Nominated Posts తీసుకున్నవాళ్ళే అన్ని బూత్లు తిరిగి సైకిల్ కి ఓటు వేయమని చెప్తున్నారు -రోజా రెడ్డి

నగరి లో #CycleIsComingpic.twitter.com/9LRept1Pgd

— DINU (@I_dinutweets) May 13, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు