చంద్రబాబు... తెలుగుజాతిని ముక్కలు చేస్తుంటే చూస్తున్నావేం... లక్ష్మీపార్వతి

బుధవారం, 10 జులై 2013 (21:48 IST)
FILE
కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు సిద్ధపడుతుంటే చంద్రబాబు నాయుడు చేతకానివాడిలా చేతులు ముడుచుకుని కూర్చున్నారని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. తెలుగుజాతి సమైక్యత కోసం ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో ఉండి తెలుగు నేలను ముక్కలు చేస్తుంటే అసహాయంగా చూస్తున్న చంద్రబాబు ఇక ఎంతమాత్రం తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిలో ఉండటానికి వీల్లేదని అన్నారామె.

అధికారం కోసం సిద్ధాంతాల మార్చుకుంటావా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ అనర్థానికయినా నువ్వే సూత్రధారుడివనీ, ప్రశ్నించలేని పరిస్థితిలో ఉన్నావని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ పరువును తీయకుండా ఎవరయినా యువకుడికి పార్టీ పగ్గాలను అప్పజెప్పి గౌరవంగా తొలగిపోవాలని డిమాండ్ చేశారు.

వెబ్దునియా పై చదవండి