Aadi Sai Kumar: ఆది సాయి కుమార్ మిస్టికల్ థ్రిల్లర్ శంబాల రిలీజ్ అనౌన్స్‌మెంట్

చిత్రాసేన్

శనివారం, 18 అక్టోబరు 2025 (18:09 IST)
Aadi Sai Kumar - Shambala
హీరో ఆది సాయి కుమార్ నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్. ఇప్పటికే శంబాల మీద ఉన్న అంచనాల గురించి అందరికీ తెలిసిందే.  పోస్టర్లు, గ్లింప్స్, మేకింగ్ వీడియో, టీజర్‌తో సహా ఇప్పటివరకు విడుదలైన కంటెంట్‌తో శంబాల పై ట్రేడ్ సర్కిళ్లలో భారీ డిమాండ్ నెలకొంది. ఆడియెన్స్‌లోనూ ఈ చిత్రంపై మంచి పాజిటివ్ బజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే.
 
దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌తో సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ మూవీ డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా తెరపైకి రానుంది. క్రిస్మస్ సెలవుల్లో బాక్సాఫీస్ రేసులో ప్రధాన పోటీదారులలో ఒకటిగా ‘శంబాల’ నిలిచింది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో ఆది కనిపించిన తీరు, పోస్టర్‌లో కనిపించిన ఓ కుక్క, వెనకాల పొగతో ఏర్పడిన ఓ ఆకారం ఇవన్నీ చూస్తుంటే మూవీపై మరింత క్యూరియాసిటీ పెరిగేలా ఉంది.
 
షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ఆకాశన్నంటే హైప్ క్రియేట్ అయింది. ఈ అంచనాలు ‘శంబాల’ మార్కెట్ విలువను మరింతగా పెంచేస్తోంది. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు.
 
రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్, రాజీలేని నిర్మాణంతో సినిమాను ఎంతో క్వాలిటీతో రూపొందిస్తున్నారు. విజువల్ వండర్‌గా ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.
 
ప్రవీణ్ కె బంగారి అందించిన ఆకర్షణీయమైన విజువల్స్, శ్రీచరణ్ పాకాల స్వరపరిచిన అద్భుతమైన నేపథ్య సంగీతం హైలెట్ కానున్నాయి. దీని కథాంశం, కంటెంట్ పాన్-ఇండియన్ స్థాయికి తగ్గట్టుగానే ఉంటాయని, అందుకే క్రిస్మస్ సీజన్‌లో డిసెంబర్ 25న మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ సిద్దమయ్యారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు