తెలంగాణా రాష్ట్ర సమితి శనివారం బంద్కు పిలుపునిచ్చిన సందర్భంగా వరంగల్లో చెదురుమదురు సంఘటనలు జరిగాయి. నర్సంపేట పట్టణంలో తెరాస కార్యకర్తలు బంద్ సందర్భంగా దుకాణాలను మూయిస్తున్న క్రమంలో పెట్రోల్ బంకును తగులబెట్టేందుకు యత్నించారు.
వరంగల్ జిల్లా కేంద్రంలోని డీజిల్ కాలనీ వద్ద రెండు ఆర్టీసి బస్సుల అద్దాలను పగులగొట్టారు. నక్కలగుట్టలో ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన రెండు బస్సులపై రాళ్ల రువ్వి ధ్వంశం చేశారు. కార్యకర్తలు, నాయకులు ఊరేగింపులు నిర్వహించి వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూయించారు. మొత్తమ్మీద వరంగల్ జిల్లాలో తెరాస చేపట్టిన బంద్ విజయవంతమైంది.