పశ్చిమ గోదావరి: పడవలో అగ్నిప్రమాదం.. 120 మంది ప్రయాణీకులు?

శుక్రవారం, 11 మే 2018 (12:45 IST)
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం, బియ్యపుతిప్ప- ఉప్పుటూరు వద్ద గోదావరిలో పడవ బోల్తా పడటంతో 12 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా అదే పశ్చిమగోదావరిలో వందకి మించిన ప్రయాణీకులతో ప్రయాణించిన పడవలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
  
 
పశ్చిమగోదావరి జిల్లా దేవీపట్నం మండలం వీరవరపులంక వద్ద చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ప్రయాణీకులను సహాయక సిబ్బంది సురక్షితంగా రక్షించారు. పాపికొండలను తిలకించేందుకు వెళ్తున్న ప్రయాణీకులను పోలీసులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పాపికొండలను చూసేందుకు వెళ్తున్న పడవలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. 
 
అయితే అప్రమత్తమైన పోలీసులు స్థానికుల సాయంతో ప్రయాణీకులను కాపాడారు. పోశమ్మ గుడి వద్ద నుండి బయలుదేరిన పది నిమిషాలు కాగానే దేవీపట్నం మండలం వీరవరపులంక వద్దకు చేరుకోగానే పడవలో ఆకస్మాత్తుగా మంటలు చేలరేగాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.   

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు