108 రకాల వంటకాలతో అల్లుడికి అబ్బురపరిచిన నెల్లూరు అత్తమామలు

గురువారం, 2 ఫిబ్రవరి 2023 (22:35 IST)
Dishes
అత్తమామలు సాధారణంగా తమ అల్లుడిని గౌరవిస్తారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో అతిథి సత్కారాలకు పేరుగాంచిన వారిలో అల్లుడి పట్ల చూపుతున్న ఆప్యాయత చెప్పుకోదగినది. కానీ నెల్లూరు జిల్లా వాసులు మాత్రం తమకు తామే సాటే అనే రీతిలో అదరగొట్టారు. 
 
పొదలకూరు మండలం ఊసపల్లి గ్రామానికి చెందిన ఊసా శివకుమార్, శ్రీదేవమ్మ దంపతులు తమ కూతురు శివాని పెళ్లి చేసుకున్న అల్లుడు సంయుక్త శెట్టి శివకుమార్‌కు అనుకోని విందు ఇచ్చి ఆశ్చర్యపరిచారు. అల్లుడు ఇంటికి రాగానే షాకయ్యేలా వంటకాలతో అబ్బురపరిచారు. 
 
ఆయనను పొదలకూరులోని ఒక హోటల్‌కు తీసుకెళ్లి, చికెన్, మటన్, రొయ్యలు, చేపలతో సహా 108 రకాల వంటకాలను వడ్డించారు. అల్లుడు ఆ వెరైటీలు చూసి ఆశ్చర్యపోయాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు