రైతుబ‌జార్ లో రూ.25 కే కిలో ఉల్లి

శనివారం, 28 సెప్టెంబరు 2019 (14:39 IST)
ఉల్లిపాయ‌ల రేటు అమాంతంగా పెరిగిపోవ‌డంతో ప్ర‌భుత్వం రంగంలోకి దిగింది. ప్ర‌స్తుతం మార్కెట్లో కిలో ఉల్లి 50 రూపాయ‌ల‌కి అమ్ముతున్నారు. దీంతో సామాన్యులు ఉల్లిగ‌డ్డ‌లు కొనాలంటేనే భ‌య‌ప‌డిపోతున్నారు.

ఈ నేప‌ధ్యంలో ప్ర‌భుత్వం ఉల్లిధ‌ర‌ల‌ను అదుపు చేసేందుకు రంగంలోకి దిగి కిలో ఉల్లికి 25 రూపాయ‌ల‌కే ఇవ్వాల‌ని ఆదేశాలు జారీ చేసింది.

ఈ క్ర‌మంలో నెల్లూరు జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ వినోద్ స్వ‌యంగా ఫ‌త్తేఖాన్ పేట‌లో వున్న రైతుబ‌జార్ ను సంద‌ర్శించారు. వ్య‌వ‌సాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక స్టాల్ ను ఆయ‌న ప‌రిశీలించారు.

ప్ర‌తి కుటుంబానికి కిలో ఉల్లిపాయ‌లు 25 రూపాయ‌ల‌కే అందేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. అందులోభాగంగా కొనుగోలుదారుల‌కు ఆయ‌న స్వ‌యంగా ఉల్లిపాయ‌లు అంద‌చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు