రాజధాని మార్చే హక్కు మీకెవరు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో తరలించేందుకు వీల్లేదు. ప్రజాపోరాటాన్ని నిర్మించేందుకు రాష్ట్రమంతా తిరిగి జోలె పడుతా. జగన్ నరరూప రాక్షసుడు అంటూ మొన్నటివరకు ఊరూరూ తిరుగుతూ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు సీఎం జగన్‌పై తిట్ల వర్షం కురిపించారు. చంద్రబాబు మాటలు, హెచ్చరికలు విన్నవారు భయంతోనైనా ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధాని మార్చేందుకు జగన్ ముందుకు రారు అని అనుకున్నారు.
గత నెల రోజులుగా సీఎం జగన్ ఎక్కడా రాజధానిపై మాట్లాడలేదు. అభివృద్ధి వికేంద్రీకరణపై అసెంబ్లీలో బిల్లు ఆమోదానికి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ బయట జగన్‌పై వీరవిహారం చేసిన చంద్రబాబు.... ఇక లోపల చీల్చిచెండాడుతారని మరీ ముఖ్యంగా రాజధాని ప్రాంత రైతులు ఆశించారు. బాబు ప్రసంగం కోసం ఎదురుచూశారు.
అయితే చంద్రబాబు చాలా జాగ్రత్తగా రాజధానిపై ఆచితూచీ మాట్లాడారు. విశాఖ అంటే తనకెంతో ఇష్టమని కూడా చెప్పారు. ఒక రాష్ట్రం.. ఒక రాజధాని.. ఇదే టీడీపీ సిద్ధాంతమన్నారు. కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ మూడు రాజధానులు పెట్టమని చెప్పలేదన్నారు. విజయవాడ- గుంటూరు ప్రాంతం అనువైనది కాదనీ అనలేదన్నారు. అంతేతప్ప పెట్టుకోవచ్చని సూచించినట్టు ధీమాగా చెప్పలేకపోయారు.
విజయవాడ -గుంటూరు క్లస్టర్‌కు అనువైన ఇండెక్స్‌లో ఎక్కువ పాయింట్స్ వచ్చాయని చెప్పుకొచ్చారు. ప్రజాభిప్రాయ సేకరణలో 46 శాతం ఇక్కడే రాజధాని ఉండాలని చెప్పారని, అన్నీ చూసిన తర్వాత ఇదే సరైందని అనుకున్నామన్నారు. వెంటనే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కల్పించుకుని కేవలం 1500 మంది అభిప్రాయాలను ఐదు కోట్ల ప్రజల అభిప్రాయంగా ఎలా భావిస్తారని ప్రశ్నించారు. దీనికి చంద్రబాబు నుంచి సమాధానం లేదు. చంద్రబాబు ప్రసంగాన్ని బాగా గమనిస్తే అమరావతిలో కొనసాగించాలనే డిమాండ్ తప్ప విశాఖ, కర్నూల్‌పై అసెంబ్లీ బయట మాట్లాడినట్టు మాట్లాడలేకపోయారన్న వాదన వినిపిస్తోంది.
ఇక చివరగా బాబు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్ నా కంటే వయసులో చిన్నవాడైనా చేతులెత్తి మస్కరిస్తున్నా... తొందరపడొద్దు... మూడు రాజధానులుగా విభజించొద్దు. అమరావతిని కొనసాగించండి అని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు వేడుకుని సానుభూతి పొందేందుకు ప్రయత్నించారు.
నెల రోజులుగా అసెంబ్లీ బయట రాజధాని ఆందోళన పేరుతో జగన్‌ను అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పిన బాబు... జగన్ ఎదురుగా నిలిచి విశాఖను రాజధాని చేయాలని ఎవరు అడిగారని ప్రశ్నించలేకపోవడం ఆయనకే చెల్లిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదంతా ఒక ఎత్తయితే సైలెంట్‌గా మూడు రాజధానులపై అసెంబ్లీలో నిర్ణయం తీసేసుకున్న జగన్ పైనే ప్రస్తుతం అందరిలోను చర్చ జరుగుతోంది. చంద్రబాబు ఏదో చేసేస్తారనుకుంటే ఇంకేదో చేశారన్న చర్చ నడుస్తోంది. మరి జనం