రాష్ట్రంలోని 3150 ఎకరాల సిలికాగనులను, శేఖర్ రెడ్డికి ధారాధత్తం: టీడీపీ
శనివారం, 6 ఫిబ్రవరి 2021 (20:57 IST)
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోఇసుక బంగారమైందనే విషయం ప్రజలకు తెలిసిందేనని, దానితోపాటు రాష్ట్రంలోని 8వేలటన్నుల సిలికా ఖనిజా న్ని పొరుగు రాష్ట్రానికి చెందిన శేఖర్ రెడ్డికి దోచిపెట్టేందుకు వైసీపీప్రభుత్వం సిద్ధమైందని, 3150ఎకరాల్లో ఉన్న సిలికాగ నులను అతనిపరం చేయడంద్వారా రూ.6వేలకోట్ల కుంభకోణానికి జగన్ తెరలేపాడని టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ స్పష్టంచేశారు.
శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయం లో విలేకరులతో మాట్లాడారు. సిలికా ఖనిజసంపదవ్యాపారంలో ముఖ్యమంత్రి సామాజికవర్గానికి చెందినవారే అధికంగా ఉన్నారని, వారిలో 84 సిలికా గనులకు సంబంధించిన యజమానులను భయభ్రాంతులకు గురిచేసిన ఒక అధికారి ఆయాగనుల నిర్వహణను ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు (ఏపీఎండీసీ) అప్పగిస్తున్నట్లు గతంలో చెప్పాడన్నారు.
ఆ వ్యవహారంపై కొందరు గనులయజమానులు ఎదురుతిరగడంతో, వారికి ఒక్కొక్కరికీ రూ.30కోట్లనుంచి రూ.40కోట్ల ప్రభుత్వం జరిమానాలు వేసి తమదారికి తెచ్చుకుం దన్నారు. ప్రభుత్వస్వాధీనమైన సిలికా గనులను, శేఖర్ రెడ్డికి కట్టబెట్టేందుకు రంగంసిద్ధమైందని, అవంతి ఎక్స్ పోర్టర్స్ కంపెనీ ఈ వ్యవహారంలో ప్రధానపాత్ర పోషిస్తోందని రఫీ తెలిపారు.
ఎన్నికలకు ముందు ప్రజలకు తప్పుడుహామీలిచ్చి నమ్మించినట్లుగానే, అనేకమంది పారిశ్రామికవేత్తలను, గనులవ్యాపారులనుకూడా నమ్మించిన జగన్, ఇప్పుడు వారినినిలువునా వంచించా డన్నారు. సిలికా గనులను శేఖర్ రెడ్డి పరంచేస్తే, అతనొక్కడే గంప గుత్తగా తనకుముడుపులు చెల్లిస్తాడని జగన్ నమ్ముతున్నాడన్నారు.
జగన్ మాటలు నమ్మి ఆయన సామాజికవర్గానికి చెందిన సిలికా వ్యాపారులే అధికంగా నష్టపోయారన్నారు. సిలికా ఖనిజ వ్యాపారాన్ని ఎందుకుకేంద్రీకరణ చేస్తున్నారో, రాష్ట్రంలోని వ్యాపారు లను కాదని, పొరుగురాష్ట్రానికి చెందిన ఒకేవ్యక్తి చేతిలో ఈ ఖనిజ వ్యాపారాన్ని ఎందుకు పెట్టాలనుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి ప్రజలకుసమాధానం చెప్పాలని రఫీ డిమాండ్ చేశారు.
సిలికా ఖనిజానికి అంతర్జాతీయ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందని, అది విలువైన సంపదకాబట్టే, దాన్ని తనకు అనుకూలమైనవారికి కట్టబెట్టుకోవాలని ముఖ్యమంత్రి చూస్తున్నాడన్నారు. గతంలో నోట్ల రద్దు సమయంలో కొత్తకరెన్సీనోట్లు శేఖర్ రెడ్డికి కోట్లలో వచ్చాయ ని, ఆ సమయంలో అతను లోకేశ్ బినామీ అని వైసీపీవారు నానాయాగీ చేసి, దుష్ప్రచారంచేశారన్నారు.
అటువంటి వారంతా నేడు జగన్మోహన్ రెడ్డి-శేఖర్ రెడ్డిల సన్నిహితసంబంధాలపై, లో గుట్టు వ్యవహారాలపై ఏం సమాధానంచెబుతారని టీడీపీనేత నిలదీ శారు. రాష్ట్ర ఖజానాకు గండికొట్టేలా సిలికాఖనిజసంపదను శేఖర్ రెడ్డి ఒక్కడికే కట్టబెట్టే ప్రయత్నాలు ప్రభుత్వం ఎందుకు చేస్తోందో, ఇప్పటికే సిలికాఖనిజవ్యాపారంలో ఉన్న వ్యాపారులను మైనింగ్ శాఖకు చెందిన కీలకఅధికారి ఎందుకు బెదిరిస్తున్నాడో చెప్పాలని రఫీ విలేకర్లసాక్షిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సహజసంపదై న సిలికా ఖనిజంద్వారా రాష్ట్ర ఖజానాకు వచ్చేఆదాయానికి గండి పడుతున్నా కూడా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేద న్నారు. రాష్ట్రంలోని సహజవనరులను కూడా వదలకుండా జగన్మోహన్ రెడ్డి తనఅవినీతిదాహాన్ని తీర్చుకుంటున్నాడన్నారు.
శేఖర్ రెడ్డికి అప్పగించిన 3,150 ఎకరాల సిలికాగనులను, దాని ద్వారావచ్చే, రూ.6వేలకోట్లవిలువైన, 8వేలటన్నుల సిలికా ఖనిజాన్ని ఒకేవ్యక్తికి ధారాధత్తం చేయడాన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని రఫీ తేల్చిచెప్పారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం తగినవిధంగా స్పందించి చర్యలు తీసుకోకుంటే, న్యాయపోరాటం చేయడానికికూడా టీడీపీ వెనుకాడదన్నారు.
రాష్ట్రంలో మద్యం, ఇసుక తోపాటు, రివర్స్ టెండరింగ్ పద్ధతిలో కూడా జగన్ తనకు నచ్చినవారికే ప్రజలసొ మ్ముని దోచిపెడుతున్నాడన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత చర్యలు, తనస్వార్థం కోసం జగన్ తీసుకుంటున్న తెలివితక్కువ నిర్ణయాల కారణంగా రాష్ట్రానికి నష్టంవాటిల్లుతుంటే టీడీపీ చూస్తూఊరుకోదన్నారు.
ఈ వ్యవహారం పై ప్రభుత్వం స్పందించకుంటే, ఈ అంశాన్ని శాసనసభ, మండలిలో లేవనెత్తి, జగన్మో హన్ రెడ్డి అవినీతి వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకెళతామని రఫీ హెచ్చరించారు.