450 అక్రమ మద్యం బాటిల్స్ స్వాధీనం

సోమవారం, 14 డిశెంబరు 2020 (08:08 IST)
తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రాకు నలుగురు వ్యక్తులు అక్రమంగా 450 మద్యం బాటిల్స్ ను (సుమారు రూ54,000/)  పట్టుకున్న సంఘటన కృష్ణాజిల్లా- చిలకల్లు మండలంలోని ముత్యాల రోడ్డులోని సత్తమ్మ తల్లి గుడి సమీపంలోని శ్రీ శివ సాయి నగర్ లో చోటు చేసుకుంది.

ఈ సందర్భంగా చిల్లకల్లు పోలీస్ స్టేషన్ నందు డీఎస్పీ నాగేశ్వర్ రెడ్డి, సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో చిల్లకల్లు యస్ఐ 1 వి వెంకటేశ్వరావు, యస్ఐ 2 మహా లక్ష్మణుడు  సమక్షంలో పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగినది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగ్గయ్యపేట నియోజకవర్గం తెలంగాణ బోర్డర్ సమీపంలో ఉండటం వల్ల అక్రమ మద్యం వ్యాపారులు అనేక కోణాలలో చేయటం మొదలుపెట్టారని దానికి సవాలుగా మా యంత్రాంగం ఎత్తులకు పై ఎత్తులు వేసి వారి ఆగడాలకు అడ్డుకట్టలు వేస్తున్నారు. అలాగే వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

అయినను వారు ఆగకుండా దొంగ దారులలో మద్యం తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మా పోలీస్ సిబ్బంది ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అక్రమ మద్యాన్ని, ఇందులో పూర్తిగా నిషేధించే విధంగా పూర్తిగా నిషేధం అయ్యేవిధంగా అనేక ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు.

ఇందులో భాగంగా ఆదివారం మండలంలోని ముత్యాల రోడ్డు లోని సత్తమ్మ తల్లి గుడి సమీపంలోని శ్రీ శివ సాయి నగర్ వద్ద  టాస్క్  ఫోర్స్ టీమ్ 1 సిబ్బంది  తెలంగాణా నుండి అక్రమంగా తరలిస్తున్న లాహోరి కొండ సన్నాఫ్ మైత్రయ నాయక్,  ఆడాతు వేణు సన్నాఫ్ నారాయణ, లాహోరి కొండ సన్నాఫ్ తావుర్య, బాణావత్తూ శ్రీను సన్నాఫ్ రాహుల్ ఈ నలుగురి వద్ద నుండి 450 మద్యం బాటిల్స్ ను రెండు బైకులను స్వాధీనపరుచుకున్నారు.

వీరు జయంతిపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.అక్రమ మద్యం రవాణా పై చిల్లకల్లు పోలీస్ స్టేషన్ లో కేసు నమెాదు చేసి నిందితులను విచారిస్తామని వారు అన్నారు. ఈ సందర్భంగా  టాస్క్ ఫోర్స్ టీమ్ 1 సిబ్బందిని అభినందించారు.  
 
ఈ కార్యక్రమంలో  చిల్లకల్లు యస్ఐ వి వెంకటేశ్వరావు మరియు టాస్క్ ఫోర్స్ యస్ఐ మురళీకృష్ణ  కానిస్టేబుల్స్ మురళీ,వెంకటేశ్వరావు,యస్పి సిబ్బంది పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు