ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ ఏడాది సెప్టెంబరు ఆఖరి వరకు చెన్నైకి నీటి తరలింపు జరుగుతుందని వివరించారు. కాగా, ఖరీఫ్ సీజన్‌లో చిత్తూరు, నెల్లూరు జిల్లాల పరిధిలోని 2 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించినట్లు చెప్పారు.
ఆ మేరకు.. తెలుగుగంగ కాలువ కింద రెండవ పంట సాగు కోసం ఈ ఏడాది ఏప్రిల్‌లో మొత్తం 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు గుర్తుచేశారు. ఖరీఫ్ సీజన్‌లో రెండవ పంటకు భారీస్థాయిలో గంగ నీటిని విడుదల చేయడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారని వివరించారు.