శ్రీశైలానికి భారీ వరద ... 7 గేట్ల ఎత్తివేత

మంగళవారం, 17 అక్టోబరు 2017 (09:23 IST)
శ్రీశైలం జలాశయానికి వరదతాకిడి అధికమైంది. ఎగువ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టుకు వచ్చే వరద నీరు ఎక్కువైంది. దీంతో సోమవారం ఒక్కరోజే ఐదు గేట్లను ఎత్తారు. సాయంత్రం వరకు రెండు గేట్ల ద్వారా నీరు విడుదల చేశారు. 6 గంటలకు ఒక గేటు, 7.30 గంటలకు ఒక గేటు, 8 గంటలకు ఇంకో గేటు ఎత్తారు. 10 గంటలకు ఒకటి, 11 గంటలకు ఇంకొకటి ఎత్తారు. 
 
ఎగువ ప్రరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో జూరాల నుంచి 2.76 లక్షల క్యూసెక్కులు చేరుతోంది. దీంతో శ్రీశైలం నుంచి సాగర్‌కు ఏడుగేట్లు ఎత్తి 2.76 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మంగళవారం కూడా వరద మరింత పెరిగే అవకాశం ఉండటంతో మరో రెండు గేట్లను ఎత్తనున్నారు. తొమ్మిదిగేట్ల ద్వారా నీటిని వదలనున్నారు. 
 
ఇకపోతే.. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 555 అడుగులకు పైగా నీటిమట్టం చేరుకుంది. 222 టీఎంసీల మేరకు నీటి నిల్వ చేరగా, ప్రాజెక్టు గేట్లను కృష్ణమ్మ తాకింది. మరోవైపు ఆల్మట్టికి 75 వేలు, జూరాలకు 1.19 లక్షలు, నారాయణపూర్ కు 99 వేల క్యూసెక్కుల వరద వస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. 

 

Such a beautiful to see #SrisailamDam after lifting the 7 gates and releasing the water to sagar

pic.twitter.com/P4sxfcR5pL

— Rayalaseema_Now (@Rayalaseema_Now) October 15, 2017

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు