అతడు పంపిన మెయిల్ పైన ముంబై పోలీసులు ఆరా తీయగా అది హైదరాబాద్ నుంచి వచ్చినట్లు తేలింది. దీనితో సమాచారాన్ని హైదరాబాద్ పోలీసులకు అందజేశారు. దీనితో సీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి నేతృత్వంలో మెయిల్ చేసిన యువకుడిని గాలించి పట్టుకున్నారు. అతడు అమీర్ పేటకు చెందిన వంశీగా గుర్తించారు. పుణెలో వుంటున్న తన ప్రియురాలి కోసం ఇలా విమానాన్ని హైజాక్ చేస్తానంటూ ఓ నాటకం ఆడినట్లు తెలుస్తోంది.