రాష్ట్రంలో వెయ్యికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలను విభిన్న ప్రతిభావంతులతో భర్తీ చేయను న్నట్లు విభిన ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు.
వైద్య ఆరోగ్యశాఖ, పాఠశాల, కాలేజీ విద్య, వెనుకబడిన తరగతుల సంక్షేమం తదితర శాఖల్లో 668 బ్యాక్ గ్ ఖాళీలను భర్తీ చేయనున్నామన్నారు. ఇందులో ఏపీపీఎస్సీ ద్వారా 62, శాఖాధిపతుల ద్వారా 239, డీఎస్సీ ద్వారా 178, ఉపాధ్యాయ డీఎస్సీ ద్వారా 189 ఖాళీల భర్తీకి తొందరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు.
వాస్తవానికి 2019 జూన్ నెల నుండి ఇప్పటి వరకు 629 ఖాళీలు భర్తీకి చర్యలు తీసుకున్నట్లు శుక్లా తెలిపారు. వీటిలో ఎపిపిఎస్ సి ద్వారా 106 ఖాళీలు, డిఎస్ సి ద్వారా 523 ఖాళీలను భర్తీ చేయుటకు నోటిఫికేషన్స్ ఇప్పటికే విడుదల చేశామన్నారు. వీటిలో ఎపిపిఎస్ సి ద్వారా 45 ఖాళీలు భర్తీ చేయగా 61 ఖాళీలు భర్తీ ప్రక్రియలో ఉన్నాయన్నారు.