పాల కోసం వెళితే పడకగదికి... ఆ నిజాన్ని నీ భర్తతో చెప్పేస్తానంటూ బ్లాక్‌మెయిలింగ్...

బుధవారం, 17 జులై 2019 (14:04 IST)
కొందరు మహిళల్లో వున్న అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కామాంధులు రెచ్చిపోతున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో జరిగిన ఘటన ఇలాంటిదే. ఓ మహిళ దుకాణానికి వెళ్లి పాల ప్యాకెట్లు తెచ్చుకుంటూ వుండేది. ఈ క్రమంలో దుకాణం నడుపుతున్న వ్యక్తి ఆమెకి మాయమాటలు చెప్పి లొంగదీసుకుని పడకగదిలోకి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యం చేశాడు. 
 
వివరాల్లోకి వెళితే... అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఓ జంట చేతివృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఐతే ఉదయాన్నే సదరు మహిళ సమీపంలో వున్న దుకాణానికి వెళ్లి పాల ప్యాకెట్లు తీసుకుని వస్తుండేది. ఈ క్రమంలో అతడితో పరిచయం ఏర్పడింది. దీన్ని ఆసరా చేసుకున్న పాల వ్యాపారి ఆమెతో వ్యక్తిగత విషయాలను కూడా చర్చించే స్థితికి చేరుకున్నాడు. 
 
ఈ మాటలన్నీ తన సెల్ ఫోన్లో రికార్డ్ చేసి... తన కోర్కె తీర్చకపోతే విషయాన్ని నీ భర్తకు చెపుతానంటూ బెదిరించాడు. దీనితో ఆమె అతడికి లొంగిపోయింది. ఆ తర్వాత తన ముగ్గురు స్నేహితుల కోర్కె కూడా తీర్చాలంటూ వేధించాడు. చేసేది లేక ఆమె దాన్ని కూడా భరించింది. ఐతే ఇటీవల ఈ వేధింపులు మరీ ఎక్కువ కావడంతో అసలు విషయాన్ని భర్తతో చెప్పి బోరుమంది. విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందుతుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు