చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఒక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. పోలీసు స్టేషనుకు అతి సమీపంలోని తన గదిలో ఢిల్లీశ్వరి అనే కానిస్టేబుల్ సూసైడ్ చేసుకుంది. నిన్న రాత్రి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెపుతున్నారు. ఆత్మహత్యకు కారణం తెలియాల్సి వుంది. డ్యూటీ డ్రస్సులోనే ఆమె ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.