డిప్యూటీ సీఎం పవన్‌ను కలిసిన కోలీవుడ్ దర్శకుడు పార్తిబన్ (video)

సెల్వి

సోమవారం, 28 అక్టోబరు 2024 (10:36 IST)
Pawan kalyan
ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్‌ను నటుడు, డైరెక్టర్ రాధాకృష్ణన్ పార్థిబన్ ఆదివారం కలిశారు. ఆదివారం సాయంత్రం మంగళగిరిలోని డిప్యూటీ సీఎం కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌తో పార్థిబన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. 
 
ఈ సందర్భంగా పార్థిబన్‌ను పవన్ కళ్యాణ్ సత్కరించారు. జ్ఞాపికలు బహూకరించారు. పార్థిబన్ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జ్ఞాపిక అందించారు. అలాగే ఓ పుస్తకాన్ని కూడా బహూకరించారు. 
 
నటుడుతో పాటుగా డైరెక్టర్ కూడా అయిన పార్థిబన్ 16 సినిమాలకు దర్శకత్వం వహించారు. టాలీవుడ్ ప్రముఖులతో ఆయనకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్‌ను ఎందుకు కలిశారా అనేది ఆసక్తికరంగా మారింది.

డిప్యూటీ సీఎం @PawanKalyan గారితో మర్యాదపూర్వకంగా భేటీ అయిన సినీ నటుడు శ్రీ పార్థీబన్ గారు ????????. pic.twitter.com/Cm1pySdUdo

— Team PoliticalSena (@Teampolsena) October 27, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు