Poonam Kaur: మూడేళ్ల బాలికపై అత్యాచారం-పూనమ్ కౌర్ సంచలన ట్వీట్.. పవన్ స్పందించరా?

సెల్వి

మంగళవారం, 27 మే 2025 (08:34 IST)
హీరోయిన్ పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ చేసింది. ఏపీ మూడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటనపై తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనలో నిందితులకు శిక్ష పడే వరకు వాయిస్ రేజ్ చేయాలని కోరింది. 
 
మెయిన్ మీడియా ఈ విషయాన్ని కవర్ చేయలేదని, పొలిటికల్ లీడర్స్ మీద నమ్మకం లేదన్న ఆమె.. మనం వినిపించే నిరసన గళంతో ఇలాంటి యానిమల్స్ చేతిలో మరొకరు బాధితులుగా మారకుండా వుంటారని సూచించింది. బాధితురాలికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసింది. హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్‌పై స్టాండ్ తీసుకున్నందుకు హీరోయిన్‌కు థ్యాంక్స్ చెప్తున్నారు. 
 
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదని నెటిజన్లు అడుగుతున్నారు. ఒక చిన్నారి పై జరిగిన ఈ అమానుష ఘటనపై పూనమ్ కౌర్ స్పందించిన తీరు ఇప్పుడూ సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు