కడప జిల్లా పేరు మార్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం...

ఠాగూర్

సోమవారం, 26 మే 2025 (17:18 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లా పేరును టీడీపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం పేరు మార్చింది. గత వైకాపా ప్రభుత్వం ఈ జిల్లా పేరును వైఎస్ఆర్ జిల్లాగా మార్చింది. ఇపుడు ఈ పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మళ్లీ పునరుద్ధరిస్తూ పేరు మార్చింది. ఈ మేరకు సోమవారం జీవో జారీచేసింది. ఈ మార్పునకు సంబంధించిన ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా తాజాగా జీవో జారీ చేసింది. 
 
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం కడప జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లా నాటి ప్రభుత్వం మార్చింది. అయితే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే, తమ వైకాపా ప్రభుత్వంలో ఈ జిల్లా పేరును వైఎస్ఆర్ జిల్లాగా మార్చివేసింది. కడప అనే పదాన్ని తొలగించి, కేవసం వైఎస్ఆర్‌గా నామకరణం చేసింది. 
 
ఈ చర్యపై అప్పట్లో అనేక ప్రజా సంఘాలు, పౌర హక్కుల నేతలతో పాటు రాజకీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ నాటి సీఎం జగన్ ఏమాత్రం పట్టించుకోలేదు. జిల్లా  చారిత్రక గుర్తింపును తొలగించారంటూ చరిత్రకారులు సైతం తమ నిర్వేదం వ్యక్తం చేశారు. 
 
ఈ నేపథ్యంలో గత వైకాపా ప్రభుత్వంలో ప్రధాన విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు కడప జిల్లాలో పర్యటించారు. ఆ సమయంలో జిల్లా వాసులకు ఇచ్చిన హామీ మేరకు జిల్లా పేరును తిరిగి వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్చారు. ఈ పేరు మార్పునకు టీడీపీ, జనసేన, బీజేపీ మంత్రులంతా సమ్మతం తెలిపారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు