అగ్రిగోల్డ్ వైస్ ఛైర్మెన్ హత్య??? ఆత్మహత్యనా?

మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (09:07 IST)
అగ్రిగోల్డ్ వైస్ ఛైర్మెన్ సదాశివ వరప్రసాద్ హఠాన్మరణం చెందారు. ఆయన మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆయన్ను హత్య చేశారా లేదా సహజమరణం చెందారా? అనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ఆయన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విగతజీవిగా కనిపించారు. ఆయన్ను స్థానిక ప్రయాణికులు గుర్తించి ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం చేరవేయడంతో రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత సికింద్రాబాద్ గోపాలపురం పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు. 
 
అగ్రిగోల్డ్‌ స్కామ్‌ ఏపీలో రాజకీయ దుమారం రేపింది. ఈ స్కామ్‌ నాలుగు రాష్ట్రాలను కుదిపేసింది. ఖాతాదారులకు సకాలంలో డిపాజిట్లు చెల్లించడంలో ఆ సంస్థ విఫలమైంది. దాదాపు 13 లక్షల మందిని ఈ సంస్థ నట్టేట ముంచింది. అగ్రిగోల్డ్ డైరెక్టర్లు అరెస్టు కాగా, ఆ తర్వాత వీరంతా బెయిలుపై విడుదలయ్యారు. అదేసమయంలో అగ్రిగోల్డ్ ఆస్తులను ఏపీ సర్కారు స్వాధీనం చేసుకుంది. వీటిని విక్రయించి బాధితులకు పరిహారం చెల్లిస్తోంది. 
 
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పోలీస్‌స్టేషన్‌లో సంతకం చేసేందుకు తోటి డైరెక్టర్లతో కలిసి సోమవారం వరప్రసాద్‌ వచ్చాడు. స్టేషన్‌లో సంతకం చేసిన తర్వాత అందరూ కలిసి విజయవాడ వచ్చేందుకు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చారు. పార్శిల్ కౌంటర్‌ దగ్గరకు రాగానే వరప్రసాద్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. క్షణాల్లోనే ప్రాణాలు విడిచినట్టు తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు