ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు లేఖ రాశారంటే, మోడీకన్నా సీనియర్ అయిన చంద్రబాబు బ్రహ్మాండం ఏదో బద్ధలు కొట్టారని అనుకున్నాం. పోనీ మొన్న విశాఖపట్నం వెళ్ళి నడిరోడ్డు మీద తెలుగులో చెప్పిన డైలాగుల్లో ఏ ఒక్కటైనా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారేమో అని చూశాం.
"అమ్మటానికి వాడెవ్వడు - కొనటానికి వీడెవ్వడు.." అని రోజూ మోగుతున్న చంద్రబాబు, ఆయన బృందం ఈ మాట ఉత్తరంలో రాశారేమో అని చూశాం. ఏ ఒక్కటీ లేదు. అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయటానికి వీలే లేదు అని ఒక్క వాక్యం కూడా రాయలేదు.