చెత్తకాగితాలు ఏరుకుని చంద్రబాబు వెళ్ళడం నేను చూడాలి: నారాయణస్వామి

గురువారం, 18 ఫిబ్రవరి 2021 (20:23 IST)
ప్రతిపక్షనేత, తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి. పంచాయతీ ఎన్నికల్లో టిడిపిని జనం ఘోరంగా ఓడించారన్నారు. టిడిపికి రాష్ట్రంలో నూకలు పూర్తిగా చెల్లిపోయాయన్నారు. 
 
కొన్ని వ్యవస్ధలను తనవైపు తిప్పుకుని పంచాయతీ ఎన్నికల్లో ఏదో చేయాలనుకున్నారు చంద్రబాబు. అయితే ఆయనకు జనం సరైన గుణపాఠం చెప్పారన్నారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో చెత్త కాగితాలు ఏరుకుని చంద్రబాబు వెళ్ళడం తాను చూడాలన్నారు. చంద్రబాబును చూసి వరుణుడు కూడా వర్షం పడనీయలేదన్నారు.
 
కుప్పంలో ప్రజలు తాగు, సాగునీరు లేకుండా ఇబ్బంది పడటానికి చంద్రబాబు చేతకానితనమే కారణమంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలు అన్ని విధాలుగా అభివృద్థి చెందుతున్నాయి కాబట్టే ప్రజలు వైసిపి మద్ధతుదారులను పంచాయతీ ఎన్నికల్లో గెలిపించారన్నారు.
 
మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లో వైసిపి విజయం చారిత్రాత్మకమన్నారు. ఈ విజయాన్ని ముందే ఊహించామని.. రాష్ట్రంలో అత్యధికశాతం ప్రజలు ఓటింగ్‌లో పాల్గొని అభివృద్థి చేసే వ్యక్తులనే ఎన్నుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి. నవరత్నాలతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నిండడం వల్లే వైసిపి ప్రభుత్వంపై, జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలకు మరింత నమ్మకం ఏర్పడిందని.. ఆ నమ్మకమే పంచాయతీ ఎన్నికల్లో విజయసోపానంగా మారిందన్నారు ఉపముఖ్యమంత్రి.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు