ఏపీ అసెంబ్లీ సమావేశాలు మార్చి తొలి వారంలో ప్రారంభం కానున్నాయి. మార్చి 4 లేదా 7న బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాలని ఏపీ సర్కారు భావిస్తోంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే కొత్త రాజధాని ఏర్పాటు, కొత్త జిల్లాలపై ప్రత్యేక బిల్లులను ప్రభుత్వం తీసుకురానున్నట్లు సమాచారం.
ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలనను అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్న తరుణంలో ఉగాదికి ఇంకా రెండు నెలల సమయం ఉండటంతో ఈలోపు అసెంబ్లీ, శాసనమండలి బడ్జెట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదింపజేసుకోవడంపై జగన్ ప్రభుత్వం దృష్టి సారించింది.