ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. దీపావళి కానుకగా ఒక డీఏను ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. మంత్రివర్గ ఉపసంఘం, ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం రూ. ఏడువేల డీఏలు పెండింగ్‌లు పెట్టిందన్నారు.
వైసీపీలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ఆరోపించారు చంద్రబాబు. అయితే తమ సర్కారు డీఏను రెండు విడుతలుగా ఇస్తామని, నవంబర్‌లో రూ.105 కోట్లు, జనవరిలో రూ.105కోట్లు చెల్లిస్తామని వెల్లడించారు. ఉద్యోగులకు డీఏలకు దీని కోసం ప్రతి నెలా రూ, 160 కోట్లు ఖర్చు అవుతుందన్నారు.