సివిల్ సర్వీస్ ఉద్యోగం ఉంటే క్రికెట్ మ్యాచ్ వంటిది : సీఎస్ ఎల్వీ

శనివారం, 20 ఏప్రియల్ 2019 (12:33 IST)
సివిల్ సర్వీస్ ఉద్యోగంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు చేశారు. సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ఏపీ సచివాలయంలో ఏఐఎస్ వేడుక జరిగింది. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం పాల్గొని భావోద్వేగ ప్రసంగం చేశారు.
 
ప్రభుత్వంలో పని చేసే ప్రతి ఐఏఎస్ అధికారితో పాటు ప్రభుత్వ అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా ఎంతో సహనంతో నడుచుకోవలన్నారు. కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో ఒత్తిడిని అధిగమించాలని కోరారు. నిజాయితీతో నిర్ణయాలు తీసుకునే సమయంలో ఒత్తిడిని అధికమించాలని ఆయన కోరారు.
 
అదేసమయంలో సివిల్ సర్వీస్ ఉద్యోగం అంటే క్రికెట్ మ్యాచ్ లాంటిది.. ఒక్క బాల్ సరిగ్గా ఆడకపోయినా ఔట్ కావాల్సిందే అని చెబుతూనే.. లాంగ్ టర్మ్ గేమ్‌గా అభివర్ణించారాయన. అందరి హోదా ఒకటే అని.. అది బ్లాక్ 1, బ్లాక్ 2లో ఉద్యోగం చేసినా ఒకటే అంటూ క్యాడర్‌లోని ఆంతర్యాలను విశ్లేషించారు.
 
అధికార, విపక్ష పార్టీల నేతలు రెచ్చగొడితే రెచ్చిపోవద్దనీ, ఓపిగ్గా ఉన్నప్పుడే వివాదాలకు దూరంగా ఉండగలమన్నారు. సహనం కోల్పోతే ఉద్యోగం కోల్పోతామని ఉదాహరణలతో సహా వివరించారాయన. రెచ్చగొడితే రెచ్చిపోయి వ్యాఖ్యలు చేయటం వల్ల ఉద్యోగం కోల్పోయిన అధికారులు తనకు తెలుసు అంటూ తన అనుభవాలను వివరించారు. నిజాయతీ, హుందాగా వ్యవహరించినప్పుడే బాధ్యత కూడా పెరుగుతుందని.. అప్పుడే రోల్ మోడల్‌గా ఉంటామన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు