వల్లభనేని వంశీకి షాకిచ్చిన సొంతూరు వైకాపా సర్పంచ్!!

ఠాగూర్

శుక్రవారం, 3 మే 2024 (10:24 IST)
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌‌కు అధికార వైకాపాకు చెందిన సర్పంచ్ ఒకరు తేరుకోలేని షాకిచ్చారు. వంశీ స్వగ్రామం ఉంగుటూరు. ఈ ఊరికి చెందిన వైకాపా సర్పంచి కాటూరి వరప్రసాద్‌ గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు. మండలంలోని తరిగొప్పలలో ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, బందరు పార్లమెంట్‌ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు సమక్షంలో వరప్రసాద్‌ పసుపు కండువా కప్పుకున్నారు. 
 
యార్లగడ్డ వెంకట్రావు, బాలశౌరి గెలుపునకు అహర్నిశలు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు. మాజీ జడ్పీటీసీ సభ్యుడు యలవర్తి రాజు సహా పలువురు టీడీపీలో చేరిన వారిలో ఉన్నారు. నాయకులు పొట్లూరి బసవరావు, న్యాయవాది సోమేశ్వరరావు, విక్టర్‌, బుజ్జారావు తదితరులు పాల్గొన్నారు. వల్లభనేని వంశీకి సొంత గ్రామంలోనే చేదు అనుభవం కావడంతో ఆయన చిన్నబుచ్చుకున్నారు. గ్రామ సర్పంచితో పాటు పరువురు గ్రామస్థులు కూడా టీడీపీలో చేరిపోయారు.
 
ఏపీ ఎన్నికల ప్రచారంలో హీరోయిన్ నమిత.. ఎవరికోసమంటే..!! 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. విజయం కోసం అన్ని పార్టీల అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. కొందరు అభ్యర్థులు తమ కోసం ప్రచారం చేయాలంటూ సినీ తారలను బరిలోకి దించుతున్నారు. తాజాగా హీరోయిన్ నమిత కూడా ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సత్యకుమార్ తరపున ఆమె ప్రచారం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం అసెంబ్లీ స్థానం నుంచి ఆయన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఆయనకు మద్దతుగా నమిత ప్రచారం చేశారు. 
 
ఆమె తన భర్తతో కలిసి ధర్మవరం వచ్చి.. స్థానిక చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ధర్మవరం పట్టణంలో నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్నారు. ఆమెను చూసేందుకు జనాలు విపరీతంగా తరలివచ్చారు. ఏపీలో పొత్తుల్లో భాగంగా, ధర్మవరం అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. ఇక్కడ నుంచి సత్యకుమార్ పోటీ చేస్తుండగా, వైకాపా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బరిలో ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు