10 ఏళ్లుగా ఏపీకి రాజధాని లేకుండా వుంది, దాన్ని నిర్మించాల్సిందే: నిర్మలా సీతారామన్ (video)

ఐవీఆర్

మంగళవారం, 23 జులై 2024 (19:33 IST)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ వుంది. ఈలోపుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని నిర్మాణం పూర్తి కావాల్సింది. కానీ అలా జరగలేదు. అమరావతి రాజధాని అని అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుని ఆ మేరకు నిర్మాణాలు చేపట్టారు. ఐతే 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి... అమరావతి రాజధానిని అటకెక్కించింది. మూడు రాజధానులు తెరపైకి తెచ్చి దాన్ని కూడా అమలులోకి తీసుకురాలేకపోయింది. దీనితో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది.
 

అమరావతి నిర్మాణానికి, కేంద్రం సాయం అనేది, చట్టంలో ఉంది. దాని ప్రకారం రూ.15 వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి ఇస్తున్నాం. ఇప్పుడు రాష్ట్రం ఉన్న ఆర్ధిక పరిస్థితిలో రాష్ట్రం వాటా ఇచ్చినా ఇవ్వకపోయినా, కేంద్రం మాత్రం దానికి పూర్తి బాధ్యత తీసుకుంటుంది..

ఫేక్ సైకోలు వింటున్నారా ? 15 వేల… pic.twitter.com/4w0vh9olX7

— Telugu Desam Party (@JaiTDP) July 23, 2024
తిరిగి తెదేపా-జనసేన-భాజపా కూటమి అధికారంలోకి రావడంతో అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఈరోజు కేంద్రం ప్రవేశపెట్టిన budget 2024లో Andhra Pradesh రాజధాని Amaravati నిర్మాణానికి రూ. 15,000 కోట్లు కేటాయించింది. ఈ సందర్భంగా విలేకరులు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను పలు ప్రశ్నలు వేసారు. వీటిలో అమరావతి రాజధాని నిర్మాణానికి కేటాయించిన నిధులపై కూడా వేసారు.
 
దీనికి సమాధానమిస్తూ మంత్రి... అమరావతి నిర్మాణానికి కేంద్రం సాయం అనేది చట్టంలో వుంది. దాని ప్రకారం రూ. 15 వేల కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి ఇస్తున్నాము. ప్రస్తుతం రాష్ట్రం వున్న ఆర్థిక పరిస్థితిలో రాష్ట్రం వాటా ఇచ్చినా ఇవ్వకపోయినా కేంద్రం మాత్రం దానికి పూర్తి బాధ్యత తీసుకుంటుంది అని వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు