ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా తనకు గుర్తింపు ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ సంఖ్యాబలం ఆధారంగా హోదా కల్పించాలని మంగళవారం జగన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సరైన పార్లమెంటరీ విధానాలు పాటించడం లేదని జగన్ తన పిటిషన్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా తనకు హోదా ఇవ్వాలని కోరుతూ గతంలో లేఖ ఇచ్చానని, దానిని ఇంకా అంగీకరించలేదని జగన్ ఆ పిటిషన్‌లో గుర్తు చేశారు.