ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి సర్కారుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానమైన హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అమరావతి నుంచి ఒక్క ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా ఇతర ప్రాంతాలకు తరలించవద్దంటూ గతంలో జారీచేసిన ఆదేశాలను ధిక్కరించి, సీఎం జగన్ సర్కారు విజిలెన్స్ కార్యాలయలను తరలించాలని జీవో జారీ చేసింది. దీనిపై తీవ్రంగా మండిపడింది.
కాగా, మూడు రాజధానుల విధానంలో భాగంగా సీఎం జగన్ పలు ప్రభుత్వ శాఖల కార్యాలయాలను కర్నూలు, వైజాగ్‌లకు తరలించాలించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇందులోభాగంగా, విజిలెన్స్ ప్రధాన కార్యాలయాన్ని కర్నూలుకు తరలించేలా ఇటీవల అర్థరాత్రిపూట జీవో జారీచేశారు.
దీనిపై న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ సోమవారం హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై మంగళవారం ఉదయం విచారణ జరిపిన ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు, ఇదే అంశంపై మరో రెండు లంచ్‌మోషన్ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిపై మంగళవారం మధ్యాహ్నం ధర్మాసనం విచారించనుంది.