ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీకి చెందిన అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోమారు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకే డబ్బులు లేవని, ఇపుడు మూడు రాజధానులు అవసరమా? సీఎం జగన్ గారూ అంటూ రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.
పాలనావికేంద్రీకరణ పేరుతో 13 జిల్లాలకు మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ గట్టి సంకల్పంతో ఉన్న విషయం తెల్సిందే. దీనిపై వైకాపా ఎంపీగా ఉన్న రాజు గత కొన్ని రోజులుగ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని... ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని మార్పు అవసరమా? అని ప్రశ్నించారు.