శ్రీవారి అన్నదాన కేంద్రంలో మధ్యాహ్న భోజనానికి రూ.17 లక్షలు వితరణ!

ఠాగూర్

సోమవారం, 14 ఏప్రియల్ 2025 (13:20 IST)
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా సోమవారం శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. వేకువజామున స్వామివారి సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. దర్శనం అనంతరం అన్నాకు అర్చకులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు ఆమె శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. 
 
తమ కుమారుడు మార్క్ శంకర్ వవనోవిచ్ ఇటీవల సింగపూర్‌లోని పాఠశాలలోని జరిగిన అగ్ని ప్రసాదంలో స్వల్పగాయాలతో బయటపడటంతో ఆమె స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తమ కుమారుడు కోలుకోవడంతో తిరుమలో మార్క్ శంకర్ పేరు మీద ఈ రోజు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందుకోసం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో మధ్యాహ్నం భోజనానికి రూ.17 లక్షలు వితరణ చేశారు. 
 
శ్రీవారి సేవలో అన్నా లెజినోవా 
 
జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. సోమవారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని, శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. అంతకుముందు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద ఆమెకు తితిదే అధికారులు స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం తర్వాత స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. 
 
కాగా, ఆదివారం రాత్రే తిరుమలకు చేరుకున్న అన్నా లెజినోవా శ్రీవారికి తలనీలాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. తమ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఇటీవల సింగపూర్‌లోని  స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన విషయం తెల్సిందే. ఈ నేపధ్యంలో  తమ కుమారుడు సురక్షితంగా బైటపడటంతో శ్రీవారి సేవలో అన్నా లెజినోవా  పాల్గొన్నారు.
 
అంతకుముందు ఆదివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆమె సోమవారం సుప్రభాత సేవలో పాల్గొన్నారు. సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి తన కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడినందుకు ఆమె స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు