తిరుమలలో మరో అపచారం.. మూల విరాట్ ముందు నల్లబ్యాడ్జీలతో ఉద్యోగస్తులు..

గురువారం, 24 మే 2018 (21:36 IST)
రమణ దీక్షితులు వ్యవహారం కాస్త టిటిడిని ఒక కుదుపు కుదిపేస్తోంది. శ్రీవారి పవిత్రతను, టిటిడి ప్రతిష్టను దిగజార్చే విధంగా రమణ దీక్షితులు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ టిటిడి ఉద్యోగ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తూ మూడురోజుల పాటు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నాయి. మొదటిరోజు ఉద్యోగస్తులందరూ విధులకు హాజరయ్యే సమయంలో నల్ల బ్యాడ్జీలను ధరించారు.
 
శ్రీవారి ఆలయంలో పనిచేసే కొంతమంది ఉద్యోగులు ఓవరాక్షన్ చేశారు. సాక్షాత్తు స్వామివారి మూల విరాట్ ముందు నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసన తెలపడంపై హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. టిటిడి చరిత్రలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదంటున్నారు. 
 
నిరసన అనేది ఆలయం బయట వరకే ఉండాలి కానీ.. స్వామి వారి ముందు చేయడం ఏంటని హిందూ ధార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. టిటిడి  ఉద్యోగులే మరోసారి స్వామివారి పవిత్రత దెబ్బతినేలా ప్రవర్తిస్తున్నారంటున్నారు హిందూ ధార్మిక సంఘాలు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు