మూడు రాజధానుల అంశంపై జగన్ సర్కార్‌కి సుప్రీంకోర్టులో చుక్కెదురు

బుధవారం, 26 ఆగస్టు 2020 (14:12 IST)
ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల అంశానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సీఆర్డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ చట్టాలపై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌ కో ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌‌పై విచారణ జరిపిన ధర్మాసనం ప్రభుత్వ పిటిషన్‌ను తోసిపుచ్చింది.
 
జస్టిస్‌ అశోక్‌భూషణ్‌ , జస్టిస్‌ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన ధర్మాసనం ఏపీ ప్రభుత్వ పిటీషన్ పైన విచారణ చేస్తూ... హైకోర్టు విచారణ చేస్తున్నందున ఈ దశలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ రాజధానుల అంశం హైకోర్టులో విచారణ ఉంది కనుక దీనిపై తమ వద్దకు రావడం సరికాదంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు ఈ కేసును త్వరితగతిన పూర్తిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
 
 కాగా ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా రాజధానుల ఏర్పాటు ప్రక్రియ చేద్దామనుకున్న జగన్ సర్కార్ కి మరింత జాప్యం అయ్యే పరిస్థితి కనబడుతోంది. మరోవైపు అమరావతి రైతులు తమ పరిస్థితి ఏంటంటూ ఇప్పటికీ ఆందోళన చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు