నాలుగు జోన్లుగా ఏపీ... శాసనసభ ఆమోదం

మంగళవారం, 21 జనవరి 2020 (08:26 IST)
రాష్ట్రాన్ని నాలుగు జోన్లగా విభజించాలని మంత్రివర్గం నిర్ణలన్న మంత్రివర్గ నిర్ణయాన్ని శాసనసభ ఆమోదించింది. ఇంకా ఏమేమి ఆమోదించిందంటే?
 
• హైపవర్‌ కమిటీ నివేదిక 
• నాలుగు బిల్లులకు  ఆమోదం
• పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి బిల్లుకు ఆమోదం
• విశాఖ పాలనా రాజధాని, శాసన రాజధానిగా అమరావతి బిల్లుకు ఆమోదం
• అమరావతిలోనే కొనసాగనున్న అసెంబ్లీ
• విశాఖ కేంద్రంగా సచివాలయం కార్యకలాపాలు
• హైకోర్టు కర్నూలు తరలింపునకు ఆమోదం
• రాష్ట్రాన్ని 4 పరిపాలన జోన్లుగా విభజించాలని నిర్ణయం
• జిల్లాల విభజన తర్వాత సూపర్ కలెక్టరేట్‌ వ్యవస్థ ఏర్పాటు
• మంత్రులు రెండుచోట్ల అందుబాటులో ఉండాలని నిర్ణయం
• రాజధాని ప్రాంతంలో ప్లాట్లు అభివృద్ధి చేసి రైతులకు ఇవ్వాలని నిర్ణయం
• రాజధాని రైతు కూలీలకు పరిహారం పెంపునకు మంత్రివర్గం ఆమోదం
• రైతు కూలీలకు ఇచ్చే పరిహారం రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంపు
• భూములిచ్చిన రైతులకు ప్రభుత్వమిచ్చే కౌలు పదేళ్ల నుంచి 15 ఏళ్లకు పెంపు
• సీఆర్‌డీఏ రద్దుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం
• ఏఎంఆర్డీఏ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం
• రాష్ట్రవ్యాప్తంగా 11,158 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం
• రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు రూ.199 కోట్లు కేటాయింపునకు ఆమోదం
• ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలపై లోకాయుక్త విచారణ జరిపించాలని నిర్ణయం
• పులివెందుల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు ఆమోదం
 
సీఆర్డీఏను రద్దు చేస్తూ కొత్త బిల్లు
సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో కొత్త బిల్లు ప్రవేశపెట్టింది. సీఆర్డీఏ స్థానంలో 'అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్​మెంట్ అథారిటీ'ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించింది. సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో కొత్త బిల్లు ప్రవేశపెట్టింది.

పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. సీఆర్డీఏ స్థానంలో 'అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్​మెంట్ అథారిటీ'ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించింది. సీఆర్డీఏకు సంబంధించిన ఆస్తులు, అప్పులు అన్నీ ఏఎంఆర్డీఏకు బదలాయింపు చేస్తూ ప్రతిపాదన చేసింది.

అమరావతి నుంచి రాజధాని తరలింపుపై రైతులు ఆందోళన చేస్తున్న తరుణంలో ప్రభుత్వం వారికి పరిహారాన్ని పెంచింది. భూ సమీకరణ విధానంలో అసైన్డ్ భూములు ఇచ్చిన రైతులకూ.. పట్టా భూములు ఇచ్చిన రైతులతో సమానమైన ప్లాట్లను ఇవ్వాలని ప్రతిపాదించారు.

రాజధాని ప్రాంతంలో రైతుల కౌలును మరో ఐదేళ్లు పొడిగించాలని బిల్లులో ప్రతిపాదించారు. భూములు లేని కూలీలకు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్​ను 5వేలకు పెంచాలని ప్రతిపాదన చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు