11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. తొలిరోజున గవర్నర్ ప్రసంగం

ఠాగూర్

ఆదివారం, 3 నవంబరు 2024 (10:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా తొలి రోజున గవర్నర్ ప్రసంగం కొనసాగుతుంది. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. మొత్తం పది రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేలా ప్రణాళక తయారు చేశారు. 
 
తొలి రోజున గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత అదే రోజు పూర్తి స్థాయి బడ్జెట్‌ను సభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఈ నెలాఖరుతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. బడ్జెట్‌తో పాు ప్రభుత్వం ఇతర బిల్లులను సభ ముందు ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో ఇప్పటికే పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కసరత్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు