ఎపిలో ప్రస్తుతం కేబినెట్ వ్యవహారమే హాట్ టాపిక్‌గా మారింది. ఎవరు ఉంటారు.. ఎవరికి ఉద్వాస పలుకుతారు.. తెలియని పరిస్థితి. చంద్రబాబు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినా వారి పేర్లను మాత్రం బయటకు చెప్పడం లేదని అంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో గానీ, ప్రసార మాధ్యమాల్లో గానీ ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు రాసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
దీంతో సిద్థాను రానున్న మంత్రివర్గం నుంచి తొలగించి ఆయన స్థానంలో కొత్తవారిని తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. విషయం తెలుసుకున్న సిద్థా నేరుగా బాబు వద్దకు వెళ్ళి తాడోపేడో తేల్చుకోవడానికి సిద్థమయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే నెల్లూరు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా ఉన్న సిద్థా తనను మంత్రివర్గం నుంచి తొలగిస్తే నారాయణను కూడా తీసెయ్యాలని బాబుకు చెప్పారట. అది కూడా గద్గద స్వరంతో బాబుతో ఈ మాటలను సిద్థా అన్నట్లు తెలుస్తోంది.
తాను రవాణా శాఖామంత్రిగా కష్టపడి పనిచేశానని, నెల్లూరు జిల్లాలో నేతలందరినీ కలుపుకుని పని చేశానని బాబుకు చెప్పారట. ఎవరైనా పదవిని తొలగిస్తే ఎందుకు తొలగిస్తారని ప్రశ్నిస్తారు. కానీ సిద్థా మాత్రం నా పదవి పోయినా ఫర్వాలేదు.. నారాయణకు మాత్రం మంత్రి పదవి ఉండకూడదని తేల్చి చెప్పారట. చంద్రబాబు మాత్రం సిద్థా మాటలను పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. తరువాత మాట్లాడుదాం వెళ్ళండంటూ సున్నితంగా మంత్రి సిద్థాను అక్కడి నుంచి పంపేశారట.