ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మార్పు కేసు విచారణను సుప్రీంకోర్టు బుధవారానికి వాయిదావేసింది. అలాగే, ఈ కేసును మరో బెంచ్‌కు లిస్టు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లుల అమలుపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఆ స్టేను ఎత్తివేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
అలాగే, ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టులో మరోమారు చుక్కెదురైంది. రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 107పై హైకోర్టు ఇచ్చిన స్టేను తొలగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం హైకోర్టు ఇచ్చిన స్టేను సమర్ధించింది.