రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్.. అనంతరం ప్రసంగిస్తూ 'స్వాతంత్య్ర సమరయోధులకు పాదాభివందనం. స్వాతంత్ర్యం ప్రాణవాయువు లాంటిందని గాంధీజీ చెప్పారు. రాజ్యాంగం, చట్టప్రకారం నడుచుకుంటేనే అభివృద్ధి సాధ్యం. ప్రజాస్వామ్యం ప్రకారం వ్యవస్థలు నడుచుకోవాలి' అని అన్నారు.
భవిష్యత్తులో అయినా పరిస్థితులు మారి, కేంద్రం మనసు మారి ప్రత్యేక హోదా ఇస్తుందని అనుకుంటున్నామని.. అప్పటి వరకూ కేంద్రాన్ని డిమాండ్ చేస్తూనే ఉంటామన్నారు. హోదా అంశం మళ్లీ సెంటిమెంట్ అయితే.. తాము ఎప్పటికైనా సాధిస్తామన్నట్లుగా జగన్ చెప్పుకొచ్చారు.
తమ పాలనలో రాజ్యాంగం మొదటి పేజీలో రాసిన జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనే పదాలకు నిజమైన అర్థం చెబుతున్నామని జగన్ ప్రకటించారు.